Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇది నరేంద్ర మోదీ భారత్.. వేటాడి అంతం చేస్తాం: అమిత్ షా

ఇది నరేంద్ర మోదీ భారత్.. వేటాడి అంతం చేస్తాం: అమిత్ షా

amit shah

Amit Shah Warns Terrorists | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తొలిసారి ఘాటుగా స్పందించారు. ఈ ఉగ్రదాడికి సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వంలో, ప్రతి ఉగ్రవాద చర్యకు తగిన ప్రతిస్పందన ఇస్తామని చెప్పారు. “ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం.

ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తాం. కాశ్మీర్ ఉగ్రవాద చర్యకు గట్టి సమాధానం ఇస్తున్నాం. ఎవరైనా దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది నరేంద్ర మోదీ భారత్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది.

పహల్గామ్‌లో అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని హెచ్చరించారు అమిత్ షా.

You may also like
bjp mp praveen
రాజధాని దిల్లీకి ఆ పేరు పెట్టండి: బీజేపీ ఎంపీ లేఖ!
‘పహల్గాం ఉగ్రదాడి..ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్’
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
amith shah
రాష్ట్రాల సీఎంలకు హోం మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions