Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రజల ‘పోప్’ ఫ్రాన్సిస్ కన్నుమూత

ప్రజల ‘పోప్’ ఫ్రాన్సిస్ కన్నుమూత

Pope Francis Dies At 88 | కాథలిక్ చర్చి చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా గుర్తించబడ్డ పోప్ ఫ్రాన్సిస్ భారతీయ కాలమానం ప్రకారం సోమవారం 88 సంవత్సరాల వయస్సులో, వాటికన్‌లోని కాసా శాంటా మార్తాలో తుదిశ్వాస విడిచారు. వాటికన్ ఆయన మరణాన్ని అధికారికంగా ధృవీకరించింది.

ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా కాథలిక్ సమాజాన్ని దిగ్భ్రాంతి గురిచేసిందని పేర్కొంది. ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆయన అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో. జోర్జ్ మారియో బెర్గోగ్లియో 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరిస్‌లో ఇటాలియన్ వలసదారుల కుటుంబంలో జన్మించారు. 1973 నుండి 1979 వరకు అర్జెంటీనాలో జెసూట్ ప్రావిన్షియల్ సుపీరియర్‌గా పనిచేశారు. 1998లో బెర్గోగ్లియో బ్యూనస్ ఐరిస్ ఆర్చ్ బిషప్‌గా నియమితులయ్యారు.

2001లో పోప్ జాన్ పాల్ II ఆయనను కార్డినల్‌గా ఎన్నుకున్నారు. 2013లో పోప్ బెనెడిక్ట్ XVI రాజీనామా తర్వాత, బెర్గోగ్లియో 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ అనే పేరును ఎంచుకున్నారు, ఇది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసీకి నివాళిగా పేరును మార్చుకున్నారు.

అమెరికా ఖండాల నుండి వచ్చిన మొదటి పోప్ గా మరియు 8వ శతాబ్దం తర్వాత ఐరోపా వెలుపల జన్మించిన మొదటి పోప్ గా నిలిచారు. వాటికన్‌లోని ఆడంబరమైన పాపల్ అపార్ట్‌మెంట్‌లలో నివసించడానికి బదులు, కాసా శాంటా మార్తా గెస్ట్ హౌస్‌లో సాదాసీదాగా జీవించడాన్ని ఎంచుకున్నారు.

పర్యావరణ సమస్యలు, ఆర్థిక అసమానతలు, మరియు సామాజిక న్యాయంపై దృష్టి సారించారు. ఆయన ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ, మరియు ఇతర ప్రాంతాలలో శాంతి కోసం పిలుపునిచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ యవ్వనంలో ప్లూరిసీ వ్యాధి కారణంగా ఒక ఊపిరితిత్తి భాగాన్ని తొలగించారు, ఇది ఆయన జీవితాంతం ఆరోగ్య సమస్యలకు కారణమైంది.

పోప్ గత కొంతకాలంగా తీవ్రమైన శ్వాసకోశ, డబుల్ న్యోమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 2025 ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన పోప్ గతనేలే డిశ్చార్జ్ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ ను ప్రజల పోప్ గా పిలుస్తారు.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions