Tuesday 29th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘అనకాపల్లి ఘటన..హోంమంత్రితో ఫోన్లో మాట్లాడిన సీఎం’

‘అనకాపల్లి ఘటన..హోంమంత్రితో ఫోన్లో మాట్లాడిన సీఎం’

Explosion at fireworks manufacturing unit in Anakapalle | అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సంభవించిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఎనమిది మంది మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది.

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కార్మికులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మరోవైపు అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions