Sunday 6th July 2025
12:07:03 PM
Home > తాజా > థమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

థమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

Balakrishna Surprise Gift To Balakrishna | మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( Music Director Thaman ) కు నటుడు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ గిఫ్ట్ ( Surprise Gift ) ఇచ్చారు. బాలకృష్ణ థమన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే.

వీరి కాంబోలో వచ్చిన గత సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాల ద్వారా ఏర్పడిన వీరి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ తన సోదరుడు లాంటి వాడని బాలకృష్ణ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా నందమూరి థమన్ తమ కుటుంబ సభ్యుడని బాలకృష్ణ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో శనివారం ఖరీదైన పోర్షే కారు ( Porsche Car )ను కొనుగోలు చేసి థమన్ కు బహుకరించారు.

అనంతరం థమన్ ప్రతిభను ప్రశంసించి, భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడు థమన్ కు ప్రేమతో కారును బహుకరించినట్లు బాలకృష్ణ పేర్కొన్నారు.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions