Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘కెప్టెన్ రోహిత్ శర్మ..ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి’

‘కెప్టెన్ రోహిత్ శర్మ..ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి’

Navjot Singh Sidhu About Rohit Sharma | సిడ్నీ ( Sydney ) వేదికగా ఆస్ట్రేలియా భారత్ ల మధ్య ఐదవ టెస్టు మ్యాచ్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.

అయితే ఈ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) దూరంగా ఉండడం సంచలనంగా మారింది. ఆయన స్థానంలో జస్ప్రిత్ బుమ్రా పగ్గాలు చేపట్టారు. అయితే రోహిత్ ఇష్టపూర్వకంగానే టెస్టుకు దూరంగా ఉన్నారా ? లేక మేనేజ్మెంట్ ( Management ) అతన్ని దూరంగా పెట్టిందా అనేది తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

ఇదే సమయంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ( Navjot Singh Sidhu )స్పందించారు. ఒక కెప్టెన్ ని సిరీస్ మధ్యలో డ్రాప్ చేయకూడదని, అతను రెస్ట్ తీసుకోవాలని భావించినా ఆ ఆప్షన్ ( Option ) కూడా ఇవ్వొద్దన్నారు. ఇది తప్పుడు సంకేతాలను పంపిస్తుందని పేర్కొన్నారు.

గతంలో మార్క్ టైలర్, అజారుద్దీన్ వంటి వారు సరైన ఫార్మ్ లో లేకున్నా కెప్టెన్స్ గా కొనసాగారని గుర్తుచేశారు. ఒక కెప్టెన్ మ్యాచుకు దూరంగా ఉండడం భారత క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారన్నారు.

రోహిత్ శర్మకు గౌరవం ఆయనపై మరింత నమ్మకం ఉంచాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పై ఉందని తెలిపారు. ఎందుకంటే ప్రస్తుత టీంను ఈ స్థాయిలో నిలబడగలిగిందంటే దానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అని చెప్పారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions