ACP Ramesh About Allu Arjun | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్. సంధ్య థియేటర్ వద్ద అసలు ఏం జరిగిందో వివరించారు ఏసీపీ రమేష్ ( ACP Allu Arjun ).
ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని, బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ కు చెప్పాం. థియేటర్ నుండి వెళ్లిపోవాలని సూచించాం. అయినప్పటికీ మేనేజర్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు. అతి కష్టం మీద అల్లు అర్జున్ వద్దకు వెళ్లి మహిళ చనిపోయిందని చెప్పగా నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. సుమారు 10 నిమిషాల వెయిట్ చేశాక డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చాము’ అని ఏసీపీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ( Cv Anand ) పేర్కొన్నారు.