One-Hour Darshan Option At Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా చేస్తున్న ప్రయత్నానికి కార్యచరణ ప్రారంభమయిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) పేర్కొన్నారు.
వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని గురువారం నుంచి అమలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.
ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలకమండలిలో ఆమోదం లభించనుంది. గంటలోపే దర్శనం చేయించడానికి మొదటగా వారి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందిస్తారు.
ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్‌లో స్కానింగ్ అనంతరం క్యూ లైన్‌లోకి పంపుతారు. గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది.
ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందితో పని లేకుండా ఎఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు.
ఈ విధానం అమలుకు ఎఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని బీఆర్ నాయుడు చెప్పారు.