Manchu Mohan Babu Tweet | నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుటుంబంలో ఇటీవల వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జల్ పల్లి లోని తన నివాసంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. దీంతో మోహన్ బాబుపై కేసు నమోదైంది.
విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు ఆదేశించారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ రద్దు అయిందని, మోహన్ బాబు పరారీలో ఉన్నాడంటూ శుక్రవారం నుంచి మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో మోహన్ బాబు మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని వాటిని ఖండించారు.తన ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేదనీ.. ప్రస్తుతం తను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని తెలిపారు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాను కోరుతున్నానని పోస్ట్ చేశారు.