Father Killed Person Who Misbehaved With His Daughter | తన కూతురి పై అసభ్యకరంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుండి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి.
తానే హత్య చేసినట్లు ఒక వీడియోను సైతం విడుదల చేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ,ఆంజనేయ ప్రసాద్ దంపతులు కువైట్లలో ఉంటున్నారు.
అయితే వారి 12 ఏళ్ల కుమార్తెను చంద్రకళ చెల్లెలు లక్ష్మీ, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి మనవరాలు వరుసయ్యే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు, ఇదే విషయాన్ని బాలిక తమకు చెప్పినట్లు తండ్రి ఆంజనేయ ప్రసాద్ వెల్లడించారు.
దింతో కువైట్ నుండి వచ్చిన తల్లి చంద్రకళ ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నిందితున్ని కేవలం మందలించి వదిలేశారు. దింతో ఆవేదనకు గురైన తండ్రి ఆంజనేయ ప్రసాద్ శనివారం కువైట్ నుండి వచ్చి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న నిద్రిస్తున్న నిందితుడి తలపై ఇనప రాడ్డుతో కొట్టి చంపాడు.
హత్య చేసి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు. అనంతరం ఒక వీడియోను విడుదల చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసుల ముందు లొంగిపోతానని వెల్లడించాడు.