Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కోల్కత్త హత్యాచార ఘటన..నిందితుడు సంచలన ప్రకటన

కోల్కత్త హత్యాచార ఘటన..నిందితుడు సంచలన ప్రకటన

Kolkata Rape-Murder Accused Sanjay Roy | కోల్కత్త ( Kolkata ) లోని ఆర్ జి కర్ ( RG Kar ) మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో న్యాయం కావాలంటూ వైద్యులు నిరసనలు చేస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ( Sanjay Roy ) సంచలన వ్యాఖ్యలు చేసాడు. హత్యాచార కేసు విచారణలో భాగంగా సంజయ్ రాయ్ ని సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు.

ఈ కేసు మొత్తం కోల్కత్త మాజీ పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ ( Vineet Goel ) కుట్ర అని అతడు ఆరోపించాడు. ఈ కేసులో తనను ఇరికించారని మీడియాకు చెప్పాడు. పోలీసులు సంజయ్ ని వ్యాన్ ( Police Van ) లో తరలిస్తున్న సమయంలోనే అతడు ఈ వ్యాఖ్యలు చేసాడు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions