Sunday 24th November 2024
12:07:03 PM
Home > క్రీడలు > 51/2 నుండి 53 పరుగులకే ఆల్ ఔట్..బౌలర్ల ఊచకోత

51/2 నుండి 53 పరుగులకే ఆల్ ఔట్..బౌలర్ల ఊచకోత

53 All Out Western Australia vs Tasmania | బౌలర్లు ( Bowlers ) రెచ్చిపోతే ఎం జరుగుతుందో తాజగా ఓ మ్యాచ్ లో నిరూపితమైంది. ఓ దశలో 51 పరుగులకు రెండు వికెట్లే కోల్పోయిన టీం అనంతరం కేవలం రెండు పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

సాధారణంగా బౌలర్లపై బ్యాట్సమెన్స్ ( Batsmen ) హవా ఉంటుందని అందరూ అంటారు. కానీ ఆస్ట్రేలియా దేశవాళీ ( Domestic ) క్రికెట్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. దింతో ఓ చెత్త రికార్డ్ నమోదైంది. ఆస్ట్రేలియా వన్డే కప్ ( Oneday Cup ) లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు టాస్మానియా ( Tasmania ) జట్టు చుక్కలు చూపించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా ఓ దశలో రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కానీ టాస్మానియా బౌలర్ వెబ్ స్టర్ ( Webster ) ధాటికి పేకమేడలా ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ( Lineup ) కుప్పకూలింది. ఆఖరికి 53 పరుగులకే సదరు టీం ఆల్ ఔట్ ( All Out ) అయ్యింది.

ఓపెనర్ ఆర్కి షార్ట్ ( D’Arcy Short ) 22 పరుగులతో టాప్ స్కోరర్. కానీ ఆరుగురు బ్యాట్సమెన్స్ డక్ ఔట్ అయ్యారు. వెబ్ స్టర్ కు తోడుగా స్టాన్ లేక్ మూడు, రోజేర్స్ ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టాస్మానియా మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేదించింది.

You may also like
పవన్ కళ్యాణ్ మరోసారి 100% స్ట్రైక్ రేట్
మహారాష్ట్ర ఫలితాలు..పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో పరిస్థితి ఇలా !
ఏదో జరుగుతోంది..ఎన్నికల ఫలితాలపై సంచలన ఆరోపణలు
తొలిసారి పోటీ..ప్రియాంక గాంధీ ప్రభంజనం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions