Lawrence Bishnoi News | గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ( Gangster Lawrence Bishnoi ) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది. సల్మాన్ ఖాన్ ( Salman Khan )ను చంపేస్తాం అంటూ బెదిరించడం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ( Baba Siddique ) హత్యతో లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతుంది.
ఈ క్రమంలో బిష్ణోయ్ కి సంబంధించిన పలు సంచలన విషయాలను ఆయన బంధువు రమేష్ బిష్ణోయ్ ( Ramesh Bishnoi )వెల్లడించారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైల్లో ఉన్న అతని సోదరుడు, సహచరుడు గోల్దీ బ్రార్ ( Goldy Brar ) కెనడా ( Canada ) నుండి గ్యాంగ్ ను నడిపిస్తున్నారు.
బిష్ణోయ్ జైల్లో ఉన్నా అతడి ఖర్చుల కోసం తన కుటుంబం సంవత్సరానికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సోదరుడు రమేష్ చెప్పారు.
లారెన్స్ కుటుంబం మొదటి నుండే సంపన్న కుటుంబం అని, వారి గ్రామంలో ఆ కుటుంబానికి 110 ఎకరాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే లారెన్స్ గ్యాంగ్ స్టర్ గా మారుతాడాని తామెప్పుడు అనుకోలేదని రమేష్ బిష్ణోయ్ తెలిపారు.









