Thursday 1st May 2025
12:07:03 PM
Home > తాజా > బాలకృష్ణ ‘అఖండ -2’ స్టార్ట్..క్లాప్ కొట్టిన నారా బ్రాహ్మణి

బాలకృష్ణ ‘అఖండ -2’ స్టార్ట్..క్లాప్ కొట్టిన నారా బ్రాహ్మణి

Akhanda Part 2 | తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ పార్ట్ 2 తాండవం’ పట్టాలెక్కింది. ఈ మేరకు హైదరాబాద్ ( Hyderabad ) లో సినిమా పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

బాలకృష్ణ ( Nandamuri Balakrishna )బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సింహ ( Simha ), లెజెండ్ ( Legend ), అఖండ ఇలా మాస్ కంటెంట్ ( Mass Content ) తో విడుదలైన సినిమాలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అలాగే అఖండ పార్ట్ 2 అద్భుతంగా ఉండబోతోందని దర్శకుడు బోయపాటి స్పష్టం చేశారు.

తాజాగా అఖండ పార్ట్ 2 పూజ కార్యక్రమానికి బాలకృష్ణ కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని మరియు ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కు నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టారు.

దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అఖండ పార్ట్ 2 లో ప్రగ్యా జైస్వాల్ ( Pragya Jaiswal ) కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే థమన్ ( SS Thaman )మ్యూజిక్ ను అందించనున్నారు.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions