Damagundam Navy Radar Station | దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు ( Navy Radar Project )కేంద్రానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ భద్రత అంశాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ కు గర్వకారణమైన రాడార్ ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ ( Kcr ), బీఆరెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దేశ భద్రతకు వ్యతిరేకంగా బీఆరెస్ పోరాటాలు చేస్తుందా ? అని నిలదీశారు. బీఆరెస్ ( Brs ) హయాంలోనే దీనికి సంబంధించిన జీవోలు జారీ అయ్యాయని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకళా, ప్రతిపక్షంలోకి రాగానే మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
దామగుండం అటవీ ప్రాంతంలోని కొంత భూమిలో మాత్రమే చెట్లను తొలగిస్తారన్నారు. అలాగే అక్కడున్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయొద్దని, రక్షణ శాఖతో మాట్లాడి ఆ గుడిని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.