Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > అసలు విషయం బయటకు వస్తుంది..జానీ మాస్టర్ భార్య సంచలన పోస్ట్

అసలు విషయం బయటకు వస్తుంది..జానీ మాస్టర్ భార్య సంచలన పోస్ట్

Jani Master Wife | మహిళా కొరియోగ్రాఫర్ ( Choreographer ) పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెల్సిందే.

కొడుకు జైలుకు వెళ్లడం తో ఆయన తల్లి బీబీజాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చిన ఆమెను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా ( Ayesha ) అలియాస్ సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి నచ్చినట్టు రాస్తూ, నిజాలు నిర్ధారణవ్వకుండా, ఆరోపణల వెనుక అసలు ఉద్దేశమేంటో తెలుసుకోకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉండడంతో జానీ మాస్టర్ గారి అమ్మ గారు తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ పాపం ఊరికే పోదు… అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి. ‘ అని జానీ మాస్టర్ భార్య ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions