Interesting Facts About Ratan Tata | టాటా సంస్థకే కాకుండా దేశ అభివృద్ధి కోసం దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ( Ratan Tata ) ఎనలేని సేవలందించారు. సంస్థకు వచ్చే లాభాల్లో అధిక శాతం సేవా కార్యక్రమాల కోసమే కేటాయించేవారు.
ఎంతో సింపుల్ ( Simple ) గా జీవించే రతన్ టాటా బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. దేశం ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని అభిమానులు తుది వీడ్కోలు పలుకుతున్నారు.
ఈ క్రమంలో రతన్ టాటా జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మళ్ళీ గుర్తుచేసుకుంటున్నారు. రతన్ టాటాను ఆయన నానమ్మ ముంబై లోని క్యాంపియన్ స్కూల్ లో చేర్పించారు.
రతన్ టాటాను ఆయన సోదరుడ్ని స్కూల్ నుండి తీసుకురావడానికి నానమ్మ ఓ పాత భారీ రోల్స్ రాయిస్ ( Rolls Royce ) కారును పంపేది. కానీ కారులో ఎక్కడానికి రతన్ టాటాకు ఆయన సోదరుడిగా సిగ్గుగా ఉండేదంట. కారులో ఎక్కే బదులు వారు నడుచుకుంటూనే ఇంటికి వెళ్లేవారు.