Muslim Family Gets Ganesh Laddu | గత పదిరోజులుగా విశేష పూజలందుకున్న గణనాథుడు మంగళవారంతో తల్లి ఒడికి చేరుకున్నాడు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ ఉత్సవాల్లో కొన్ని చోట్ల మత సామరస్యం వెల్లివిరిసింది. గణేశ్ నిమజ్జనంలో ముస్లింలు భాగం అవడమే కాకుండా స్వయంగా లడ్డూ వేలం పాటలో కూడ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం భట్పల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు.
11 రోజుల పూజల అనంతరం వినాయకుడి లడ్డూ వేలం వేయగా గ్రామానికి చెందిన అఫ్జల్ ముస్కాన్ రూ.13,216 అప్జల్ దంపతులు లడ్డూనూ దక్కించుకున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన అప్జల్ దంపతులను గ్రామస్తులు అభినందించి వారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ దంపతులను మెచ్చుకుంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ‘గంగా జమునా తహజీబ్’ అంటూ ప్రశంసించారు. అసలైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టారని ముస్లిం దంపతులను కేటీఆర్ కొనియాడారు. ఈ మత సామరస్యం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.