Kolkata Doctor Case | కోల్‌కతా లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజి (RGKar Medical College) మరియు హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ లు వ్యక్తం అవుతున్నాయి.
కానీ, నిందితుడు సంజయ్ రాయ్ (Sanjay Rai) మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. శుక్రవారం నిందితుడ్ని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తాను పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్ధం అని నిందితుడు సమ్మతం వ్యక్తం చేశాడు. పాలిగ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావని మేజిస్ట్రేట్ అడగగా నిందితుడు భావోద్వేగానికి గురయినట్లు తెలుస్తోంది.
నేను అమాయకుడ్ని, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఇరికించారు, పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా అసలు విషయం బయటపడుతుంది అంటూ జడ్జి ముందు నిందితుడి కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్టుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మెడికల్ కాలేజి మాజీ ప్రిన్సిపల్ , కేసుకు సంబంధించిన మరో ఐదుగురికి పాలిగ్రాఫ్ టెస్టును నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.