Telangana New Governor | తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆమోదించారు.
అనంతరం రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)కు తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. తమిళి సై స్థానంలో పుదుచ్చేరి (Puducherry) లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ రాధాకృష్ణన్ కే అదనపు బాధ్యతలు ఇచ్చారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998, 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగానూ సేవలదించారు.
2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా ఆయన్ను తెలంగాణకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.