Chandrababu, Pawan Meets Amit Shah| టీడీపీ ( Tdp ), జనసేన ( Janasena ) కూటమి లో బీజేపీ ( Bjp ) చేరిక ఇక లాంఛనమే అని తెలుస్తోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ), బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ( Jp Nadda ) లతో గురువారం రాత్రి భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ).
కూటమి లో బీజేపీ చేరడం ఖరారు అయినా, సీట్ల సర్దుబాటు పై ఈ నేతలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా బీజేపీ కి 4 పార్లమెంట్ ( Parliament ), 6 అసెంబ్లీ ( Assembly ) స్థానాలను చంద్రబాబు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. రాజమండ్రి ( Rajahmundry ), అరకు ( Araku ), రాజంపేట ( Rajampeta ) మరియు తిరుపతి ( Tirupati ) పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయిస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లను గెలవాలనే లక్ష్యం తో తాము ముందుకు వెళ్తున్నట్లు, ఇందులో భాగంగా 6 నుండి 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని అమిత్ షా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాగా టీడీపీ, జనసేన లతో బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినా సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి.