YSRCP Leader Resigns | రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అధికార వైసీపీ (YCP)కి రాజీనామా చేశారు.
పార్టీ సభ్యత్వానికి, అలాగే పార్టీలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధ్యక్షులు సీఎం జగన్ (CM YS Jagan) కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల మూలంగానే రాజీనామా చేస్తున్నట్లు, తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు.
అంతేకాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా ప్రకటించారు. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కీలక పాత్రను పోషించారు ఆయన. ఇందులో భాగంగ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు వేమిరెడ్డి.
అయితే వైసీపీ చేపట్టిన సమన్వయకర్తల మార్పుల్లో నెల్లూరు జిల్లాలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించడం ఆసక్తిగా మారింది.
వ్యక్తిగత కారణాల మూలంగా అని పేర్కొన్నా, భవిష్యత్ లో వేమిరెడ్డి ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.