Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > నా వల్ల ప్రజలకు ఇబ్బంది కలగొద్దు.. సీఎం సంచలన నిర్ణయం!

నా వల్ల ప్రజలకు ఇబ్బంది కలగొద్దు.. సీఎం సంచలన నిర్ణయం!

cm revath reddy

CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తాజాగా మరో సంచలన ఆదేశాలు జారీ చేశారు.

సీఎం కాన్వాయ్ (CM Convoy)తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.

సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని చెప్పారు. తాను ప్రయాణించే మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions