Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

The earth shook all over the country… Earthquake in four states

-తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు
-తొలుత తమిళనాడులో భూకంపం
-వివరాలు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ

భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో నేడు భూప్రకంపనలు వచ్చాయి. మొదట కర్ణాటకలో ఉదయం 6.52 గంటలకు భూమి కంపించింది. రాష్ట్రంలోని విజయపురలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది.
ఆ తర్వాత మరో 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చెంగల్పట్టులో భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ 3.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అనంతరం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఉదయం 8.46 గంటలకు భూకంపం రాగా, ఉదయం 9 గంటలకు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. షిల్లాంగ్ లో 3.8 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరాలు తెలిపింది.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions