టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్న ఆయన గత ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో కుట్రపూరితంగా కొప్పుల ఈశ్వర్ గెలిచారని ఆరోపించారు.
అయినా ఈ ప్రాంతానికి ఈశ్వర్ చేసిందేది లేదని విమర్శలు గుప్పించారు. ప్రజలు అభిమానంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ ను గెలిపించినా కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపి టీఆరెస్ గెలిచినట్లు ప్రకటించారని ధ్వజమెత్తారు.
Read Also: ‘పవన్ ఆలోచన చేయాలి..’ జనసేనానికి వీహెచ్ కీలక సూచనలు!
మొరాయించిన ఈవిఎంలను మళ్ళీ లెక్కించాలంటే కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యతని విరుచుకుపడ్డారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇసుక మీద ప్రాజెక్టు కడతారు? అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ను కొరడాతో కొట్టినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మార్పు కావాలంటే, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.