Mother Suicides For Son’s College Fee | కొడుకు కాలేజీ ఫీజ్ కోసం తల్లి బసుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విధారక ఘటన తమిళనాడులో జరిగింది.
యాక్సిడెంట్ లో చనిపోతే కుటుంబానికి రూ.45,000 ప్రభుత్వ సాయం అందుతుందని కొందరు వ్యక్తులు ఆమెను తప్పుదారి పట్టించినట్లు సమాచారం.
తమిళనాడులో సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ‘సఫాయి కర్మచారి’ గా పని చేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బసుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Read Also: ఆమెపై ఫిర్యాదు చెయ్యడానికి తిరుపతి వెళ్లిన జనసేనని…!
కొడుకు ఫీజు కట్టేందుకు డబ్బులు లేక తల్లి తన జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధం ఐనట్లు వార్తలు వస్తున్నాయి.
మంచి భవిష్యత్తును ఆశించి తమ పిల్లలను చదివించడం, బతుకుదెరువు కోసం సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సంఘటన ఎత్తి చూపుతోంది.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.