Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష!

జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష!

1 year jail for jeevitha Rajasekhar | సినీనటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు పరువునష్టం కేసులో నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ( ACMM ) కోర్టు షాక్ ఇచ్చింది.

సుదీర్ఘకాలం పాటు విచారణ చేపట్టిన తర్వాత నాంపల్లి ( Nampally ) కోర్టు మంగళవారం దంపతులకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.

ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే చిరంజీవి బ్లడ్ బాంక్ ( Blood Bank ) ద్వారా రక్తాన్ని ఉచితంగా సేకరించి మార్కెట్లో డబ్బులకు అమ్ముకుంటున్నడని జీవిత, రాజశేఖర్ దంపతులు 2011 లో ఆరోపించారు.

Read Also: రియల్ హీరోయిన్ అంజు యాదవ్…రీల్ హీరో పవన్ కళ్యాణ్…!

Allu Aravind Files Defamation Case| ఈ వ్యాఖ్యలను సీరియస్ ( Serious ) గా తీసుకున్న ప్రముఖ సినీ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

చిరంజీవి పేరుతో చాలా సేవకార్యక్రమలు కొనసాగుతున్నాయని, ఎంతోమంది కి సహాయం లభిస్తుందని అటువంటి వ్యక్తికి పరువు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ దంపతులు వ్యాఖ్యలు చేశారని అల్లు అరవింద్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

చిరంజీవి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని జీవిత రాజశేఖర్ లపై అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేశారు.

2011 లో వారు చేసిన వ్యాఖ్యల వీడియోను ( Video ) అల్లు అరవింద్ కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన కోర్టు జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధించింది.

ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయించి అవకాశం కల్పించడంతో జరిమానా కట్టిన దంపతులకు నాంపల్లి కోర్టు బెయిల్ ( Bail ) మంజూరు చేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions