Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేసీఆర్ పై మోదీ విమర్శలు.. ఢిల్లీలో నేతల భేటి ఎఫెక్టేనా!

కేసీఆర్ పై మోదీ విమర్శలు.. ఢిల్లీలో నేతల భేటి ఎఫెక్టేనా!

modi kcr

Modi Fires on KCR | కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెలంగాణలోనూ కాస్త పుంజుకుంది.

అంతర్గత పోరుతో బీజేపీ కాస్త డీలా పడినట్లు సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

కేసీఆర్ మరియు బీఆరెస్ పార్టీ పట్ల బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తుంది అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో నేరుగా మోదీనే రంగం లోకి దిగారు.

తాజాగా మంగళవారం మోదీ సీఎం కేసీఆర్ (KCR)ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.

అమెరికా, ఈజిప్ట్ దేశా పర్యటన తర్వాత భారత్ కి తిరిగి వచ్చిన మోదీ వచ్చీ రాగానే నడ్డాతో భేటీ అయ్యి దేశ రాజకీయాల గురుంచి చర్చించారు.  

అనంతరం మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు.

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో ఆయా రాష్ట్రాల కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

బీజేపీ చేసిన మంచి పనుల గురించి మాట్లాడుతూ ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కుటుంబం పాలన గురించి విమర్శించారు.

అందులో భాగంగానే “తెలంగాణలో కేసీఆర్, కేసీఆర్ కూతురు బాగుండాలంటే బీఆరెస్ కు ఓటు వెయ్యండి. లేదా మీరు, మీ పిల్లలు, వారి భవిష్యత్ బాగుండాలంటే బీజేపీకి ఓటేయ్యండి” అని తెలంగాణ బీజేపీ కార్యకర్తలని, ప్రజలని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సాధారణంగా మోదీ ఏ రాజకీయ వేదికపై మాట్లాడినా ప్రతిపక్ష నేతలను పరోక్షంగా విమర్శిస్తారు కానీ వారి పేరుతో విమర్శలు చేయడం చాలా అరుదు. 

కానీ భోపాల్ జరిగిన సమావేశంలో మాత్రం ఏకంగా కేసీఆర్ పేరుతో కుటుంబ పాలన గురించి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ వ్యాఖ్యాల సారంశం ఏంటంటే.. అంటే తెలంగాణ పైన బీజేపీ ఇంకా ఆశలు వదులుకోలేదు అని చెప్పకనే చెబుతున్నారు.

మోదీ భోపాల్ లో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులు కావొచ్చని తెలుస్తోంది.

ముఖ్యoగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలోనూ బీజేపీ లో కొస్త స్తబ్ధత నెలకొంది. అంతకు ముందు ఉన్న జోష్ కనిపించడం లేదు.

అందులోనూ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. అలాగే అసలు లీడర్లు పార్టీ లో ఉంటారా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

అదీ కాకుండా రెండ్రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన ఈటెల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేంద్ర మంత్రి అమిత్ షా ని కలిశారు.

Read Also: అది ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్.. సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు!

ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ కుంటుంబం పట్ల బీజేపీ అధిష్టాన వైఖరిపై అసంత్రుప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ అవినీతి, కవిత లిక్కర్ స్కాం పైన బీజేపీ మౌనం వల్ల తెలంగాణ ప్రజల్లో అనుమానం మొదలయ్యిoదని వివరించినట్లు సమాచారం.

ఇది ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆశించన మేర ఫలితాలు సాధించకపోవచ్చని ఇద్దరు నేతలు అమిత్ షాకి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

బీజేపీ ఇలాగే మెతక వైఖరి వహిస్తే మా దారి మేం చూసుకుంటం అని ఈటెల, కోమటిరెడ్డి అమిత్ షా, నడ్డా తో జరిగిన భేటీలో అసంతృప్తి వెళ్లగక్కినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అన్ని అనుమానాలని పటాపంచలు చేయటానికి నేరుగా మోదీ రంగం లోకి దిగి ఇలా కేసీఆర్ పైన నేరుగా విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

తద్వారా వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ కి బీజేపీనే పోటీ అని చెప్పటానికి ఇలా విమర్శలు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరి ఇలా కేవలం విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారా లేదా ఈటెల కోమటిరెడ్డి చెప్పినట్టు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి.

You may also like
AP Nominated posts
ఏపీ సర్కార్ నామినేటెడ్ పదవుల జాబితా!
kcr
హలో కులకర్ణి.. ఆరోగ్యం ఎట్లుంది? కార్యకర్తకు కేసీఆర్ పరామర్శ!
Congratulations to Bandi Sanjay
కేసీఆర్ దశగ్రహ యాగాలు చేయాలి: బండి సంజయ్
pm modi
కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions