Friday 13th February 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆస్ట్రేలియాను చిత్తుచేసిన పసికూన

ఆస్ట్రేలియాను చిత్తుచేసిన పసికూన

Zimbabwe Stun Australia For The Second Time In T20 World Cup History | టీ-20 వరల్డ్ కప్ లో సంచలన విజయం నమోదైంది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును పసికూన అని భావించే జింబాబ్వే జట్టు ఓడించింది. 2007 టీ-20 వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన చరిత్ర జింబాబ్వేకు ఉంది. మళ్లీ 19 సంవత్సరాల తర్వాత గత చరిత్రను తిరిగిరాసింది. టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే లోనే ఏకంగా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మాక్సవెల్, మాట్ రెన్షా ఆచితూచి పరుగులు చేశారు. కానీ జింబాబ్వే బౌలర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దింతో 23 పరుగులతో జింబాబ్వే జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముజర్బానీ నాలుగు, బ్రాడ్ ఈవన్స్ మూడు వికెట్లతో చెలరేగిపోయారు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన ముజర్బానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.

You may also like
మున్సిపల్ ఫలితాలు..సీఎం రేవంత్ కు ప్రియాంక అభినందనలు
వాలెంటైన్స్ డే..వలపు వలలో పడొద్దు!
కోవా బన్ వివాదం..ఇంకా మానవత్వం మిగిలే ఉంది
బంగ్లాదేశ్ ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions