Ys Jagan Questions Cm Chandrababu Over Tabs Distribution | ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) విద్యార్థులకు ట్యాబ్ ( Tabs )లు పంపిణీ చేయడంలో విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) నిలదీశారు.
ఏటా డిసెంబర్ 21న 8వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్స్ అందించి పిల్లల చదువులను వెన్నుతట్టి ప్రోత్సహించే కార్యక్రమం చేసినట్లు జగన్ పేర్కొన్నారు. కానీ నేడు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్యాబ్స్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు.
చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. అలాగే వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.
అమ్మ ఒడి ఎక్కడ ?, మూడవ తరగతి నుంచి పిల్లలకు ఇచ్చే ‘ టోఫెల్ ‘ ఎక్కడ?, డిజిటల్ క్లాస్ రూముల్లో భోదన, నాడు నేడు, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన ఎక్కడ ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు.