Girl Saves Kids from Elevator | లిఫ్ట్ (Lift) ప్రమాదం నుంచి చిన్నారులను రక్షించిన ఒక బాలిక సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సిసిటివీ కెమెరాలో రికార్డ్ అవ్వగా, ఆ బాలిక సమయస్ఫూర్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఒక అపార్ట్‌మెంట్ లిఫ్ట్ లోపల ఇద్దరు చిన్నారులు ఉండగా, బయట నిలబడిన ఒక అమ్మాయి వారితో మాట్లాడుతోంది. అకస్మాత్తుగా లిఫ్ట్ తలుపులు మూసుకుపోతుండటంతో, లోపల ఉన్న పిల్లలు ప్రమాదంలో పడతారని గ్రహించిన ఆ అమ్మాయి తన ప్రాణాలకు తెగించి తలుపుల మధ్య అడ్డుపడింది.
సాధారణంగా అడ్డంకులు ఉంటే తెరుచుకోవాల్సిన లిఫ్ట్ తలుపులు, సాంకేతిక లోపం వల్ల అలాగే మూసుకుపోవడానికి ప్రయత్నించాయి. దీంతో ఆ అమ్మాయి తన శక్తినంతా ఉపయోగించి తలుపులను ఆపడానికి ప్రయత్నించింది.
గమనించిన స్థానికులు వెంటనే వచ్చి పిల్లలను క్షేమంగా బయటకు తీశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిని ‘సూపర్ హీరో’ అని కొనియాడుతున్నారు.










