Yashasvi Jaiswal News | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి టీం ఇండియా ఇంగ్లాండ్ తో రెండవ టెస్టు మ్యాచ్ ఆడనుంది.
బర్మింగ్ హమ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో టీం ఇండియా స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయబోనట్లు తెలుస్తోంది. కారణం తొలి టెస్టులో జైస్వాల్ స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తూ ఏకంగా నాలుగు క్యాచులను డ్రాప్ చేశాడు.
ఇది టీం ఇండియా విజయావకాశాలు తీవ్ర ప్రభావం చూపింది. బుమ్రా బౌలింగ్ లోనే జైస్వాల్ మూడు క్యాచులు డ్రాప్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో జైస్వాల్ షార్ట్ లెగ్, లెగ్ స్లిప్ పొజిషన్లో ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది.
కారణం ప్రాక్టీస్ సెషన్ లో కేవలం గిల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మాత్రమే స్లిప్స్ లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మరోవైపు టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ సమక్షంలో జైస్వాల్ షార్ట్ లెగ్, లెగ్ స్లిప్ లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు.
ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ధ్రువీకరించారు. జైస్వాల్ లో కాన్ఫిడెన్స్ తగ్గుకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.