Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > H1B Visa ఫీజు పెంపు.. క్లారిటీ ఇచ్చిన వైట్ హౌజ్!

H1B Visa ఫీజు పెంపు.. క్లారిటీ ఇచ్చిన వైట్ హౌజ్!

h1b visa process

H1B Visa Fee | అమెరికా (America)ప్రభుత్వం ఆ దేశంలో ఉద్యోగాల నిమిత్తం మంజూరు చేసే హెచ్ 1 బీ వీసా(H1B Visa)పై లక్ష డాలర్ల ఫీజు విధించిన విషయం తెలిసిందే. దీంతో హెచ్ 1 బీ ఫీజు నిబంధనపై ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.

అయితే ఈ గందరగోళానికి చెక్ పెడుతూ వైట్ హౌజ్ ఓ తాజా వివరణ ఇచ్చింది. హెచ్1 బీ వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా కేవలం వన్ టైమ్ ఫీజు మాత్రమేనని, వార్షిక ఫీజు కాదని వెల్లడించింది.

ఈ మేరకు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టతనిచ్చారు. ఇప్పటికే హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ ఫీజు పెంపు నిబంధన వర్తించదని తెలిపింది. హెచ్‌-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్లు అనేది వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు.

కొత్తగా హెచ్ 1బీ వచ్చిన వారు దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్‌ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు  భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని భరోసా ఇచ్చారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions