Vijayasai Reddy News | రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.
తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరుని లాగుతున్నారని పేర్కొన్నారు. ఏ రూపాయి తాను ముట్టలేదని వెల్లడించారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇటీవల లిక్కర్ స్కాం అంశంపై మాట్లాడిన విజయసాయిరెడ్డి, ఈ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డే అని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అని అభివర్ణించారు. ఇకపోతే లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కేసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ ఆసక్తిగా మారింది.