Saturday 21st December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఉత్తమ నటి సాయి పల్లవి..నటుడు విజయ్ సేతుపతి

ఉత్తమ నటి సాయి పల్లవి..నటుడు విజయ్ సేతుపతి

Vijay Sethupathi Sai Pallavi Wins Best Actors Award At CIFF | తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ( CIFF ) వేడుక గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది.

కోలీవుడ్ ( Kollywood ) స్టార్లు సందడి చేశారు. ఇందులో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘అమరన్’ మూవీకి అవార్డుల పంట పండింది. ఆమరన్ ( Amaran ) మూవీకి గాను ఉత్తమ నటిగా సాయి పల్లవి ( Sai Pallavi ) , మహారాజ మూవీకి గాను విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

అవార్డు గెలవడం పట్ల సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో పోటీ నెలకొన్న సమయంలో తనను అవార్డు వరించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. దేశం కోసం ఎంతో శ్రమించిన ముకుంద్ మరియు ఆయన కుటుంబ సభ్యుల మూలంగానే ఇది సాధ్యమయినట్లు ఆమె చెప్పారు.

ఉత్తమ చిత్రం, నటి, సినిమాటోగ్రఫీ, ఎడిటర్, సంగీత దర్శకుడు వంటి విభాగాల్లో అమరన్ మూవీ అవార్డులను గెలుచుకుంది.

You may also like
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?
మహిళ చనిపోయిందంటే సినిమా హిట్ అని అల్లు అర్జున్ నవ్వాడు
ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ ఉండవు..సినీ స్టార్లకు రేవంత్ వార్నింగ్
జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions