Venezuela’s Nicolas Maduro is Devotee Of Sathya Sai Baba | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వెనెజువెలా దేశం గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది. గత వారం వెనిజువెలాపై సైనిక చర్య చేపట్టిన అమెరికా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించింది. అనంతరం మదురోను మరియు ఆయన భార్యను అమెరికా తీసుకెళ్లింది యూఎస్ సైన్యం. దింతో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వెనెజువెలా గురించి చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికి మరియు నికోలస్ మదురోకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం వైరల్ గా మారింది. పుట్టపర్తి సత్య సాయిబాబాకు ప్రపంచంలో చాలామంది భక్తులు ఉన్నారు. అందులో వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా ఒకరు.
ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికంటే ముందు పలు సందర్భంగా భారత్ లో పర్యటించి పుట్టపర్తి సత్యసాయిను దర్శించుకున్నారు. 2005లో మదురో విదేశాంగ మంత్రి హోదాలో సతీమణితో కలిసి పుట్టపర్తి వచ్చారు. ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబును దర్శించుకున్నారు. నికోలస్ మదురో దంపతులు నేలపై కూర్చొని సత్యసాయిబాబా తో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. 2011లో సత్యసాయిబాబా తుదిశ్వాస విడిచిన తరుణంలో వెనెజువెలా దేశం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.
అంతేకాకుండా రాజధాని కరాకస్ లోని మిరాఫ్లోరెస్ ప్యాలెస్ లో తన ప్రైవేట్ కార్యాలయంలో సత్య సాయిబాబు భారీ చిత్రపటం ఉన్నట్లు అనేక మంది పేర్కొన్నారు. 2025లో సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా మదురో బాబా జ్ఞానం ఎల్లప్పుడూ వెలుగునిస్తుందని పేర్కొన్నారు. ఇకపోతే మదురో తర్వాత తాజగా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన డెల్సీ రోడ్రిగ్జ్ కూడా సత్యసాయిబాబా భక్తురాలు. 2023, 2024లో పుట్టపర్తి వచ్చి సత్యసాయిబాబా ఆశ్రమాన్ని దర్శించుకున్నారు.








