UP New Social Media Policy | ఉత్తర్ ప్రదేశ్ ( Uttarpradesh ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Cm Yogi Adityanath ) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ( Social Media ) లో ఫెక్ పోస్టు ( Fake Post )లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై యూపీ సర్కార్ కఠినంగా వ్యవహారించనుంది.
నూతనంగా సోషల్ మీడియా పాలసీ ( New Social Media Policy )ని యోగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ పాలసీకి క్యాబినెట్ ( Cabinet ) ఆమోదం లభించింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
మరోవైపు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారి భరతం పట్టనున్నారు. ఈ పాలసీ ప్రకారం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు, తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
తీవ్రతను బట్టి మూడేళ్ళ నుండి జీవిత ఖైదు శిక్ష విధించనున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తప్పుడు సమాచారం మూలంగా పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నూతన పాలసీ ద్వారా ఆకతాయిలపై యూపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.