Saturday 7th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తోడేళ్ళు కనిపిస్తే కాల్చేయండి..యోగి సంచలన నిర్ణయం

తోడేళ్ళు కనిపిస్తే కాల్చేయండి..యోగి సంచలన నిర్ణయం

Cm Yogi Orders ‘Shoot At Sight’ On Wolves | ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాష్ట్రం బహరాయిచ్ ( Bahraich ) జిల్లాను తోడేళ్ళు వణికిస్తున్నాయి. జిల్లాలోని మహసి ప్రాంతంలో ఆరు తోడేళ్లు ( Wolves ) గల ఓ గుంపు సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నాయి.

ఈ దాడుల్లో ఇప్పటికే 10మంది మృతి చెందగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు. మృతిచెందిన వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ( Cm Yogi Adityanath ) కీలక నిర్ణయం తీసుకున్నారు. తోడేళ్ల పై ‘షూట్ ఎట్ సైట్’ ( Shoot At Sight ) ఆర్డర్ జారీ చేశారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు.

తోడేళ్లను పట్టుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఖేడియా’ ( Operation Khedia )లో భాగంగా నాలుగు తోడేళ్లను పట్టుకున్నట్లు, మరో రెండు మాత్రం దొరకడం లేదని అధికారులు సీఎంకు వివరించారు.అవి నిత్యం స్థావరాలను మారుస్తున్నట్లు సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో అవి కనిపిస్తే కాల్చేయండి అని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ‘షూట్ ఎట్ సైట్’ ను చివరి అవకాశంగా మాత్రమే భావించాలని సీఎం పేర్కొన్నారు.

You may also like
దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక అంతే !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions