Union Budget 2025: No Income Tax Upto Rs.12 Lakhs | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman )శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర మంత్రి వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్టాండర్డ్ డిడక్షన్ ( Standard Deduction ) తో కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు సున్నా పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రూ.18 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి రూ.75 వేలు లబ్ది చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ. లక్ష పదివేల లబ్ది చేకూరనుంది.
అంతేకాకుండా కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబుల గురించి వివరించారు. రూ.0-రూ.4 లక్షల వరకు సున్నా, రూ.4లక్షల-రూ.8 లక్షల వరకు 5%, రూ.8 లక్షల నుండి రూ.12 లక్షల వరకు 10శాతం, రూ.12 లక్షల నుండి రూ.16 లక్షల వరకు 15 శాతం, రూ.16 లక్షల నుండి రూ.20 లక్షల వరకు 20 శాతం, రూ.20 లక్షల నుండి రూ.24 లక్షల వరకు 25 శాతం, రూ.24 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30శాతం గా పన్ను ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.