Trees stand tall in middle of Bihar’s ₹100 cr road | అది నూతనంగా వేసిన రోడ్డు. ప్రస్తుతానికి ఎటువంటి గుంతలు లేకుండా రోడ్డు ఉంది. అయితే రోడ్డు మీద వేగంగా వెళ్తే మాత్రం ప్రమాదం జరగడం ఖాయం.
కారణం రోడ్డు మధ్యలోనే భారీ చెట్లు ఉన్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెను ప్రమాదం తప్పదు. ఈ రోడ్డు బీహార్ లో ఉంది. అయితే రోడ్డు మధ్యలో భారీ చెట్లు పెరగలేదు. భారీ చెట్ల చుట్టే రోడ్డు వేశారు. బీహార్ రాజధాని పట్నా నుంచి గయా వరకు సుమారు 7.48 కి.మీ. రోడ్డు వెడల్పు పనులను అధికారులు చేపట్టారు.
ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లను కేటాయించింది. అయితే జహనాబాద్ అనే ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా చెట్లు అడ్డు వచ్చాయి. దింతో అధికారులు అటవీ శాఖ అనుమతి కోరారు. కానీ అటవీ శాఖ అనుమతులు నిరాకరించింది.
అంతేకాకుండా 14 హెక్టార్ల అటవీ భూమిని పరిహారంగా కోరింది. ఈ నేపథ్యంలో అధికారులు చెట్లను తొలగించకుండ, వాటి చుట్టే రోడ్డు వేశారు. ఇలా అధికారుల నిర్వాకంతో రూ.100 కోట్ల ప్రజాధనం వృధా అయినట్లే. కారణం రోడ్డు మధ్యలోనే భారీ చెట్లు ఉండడంతో రాకపోకలు అసాధ్యం. ఒకవేళ సాధ్యపడినా ఏ క్షణమైనా ప్రమాదం జరగవచ్చు.









