Tuesday 24th February 2026
12:07:03 PM
Home > తాజా > జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్ర నాయకులు

జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్ర నాయకులు

Top Maoist Leader Devji Surrenders | ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజగా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్ జీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్ జీతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు.

ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రకటించిన విధంగా రివార్డులు, పునరావాస ప్రయోజనాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో కొందరు పోలీసులతో చర్చలు జరుపుతున్నారని వివరించారు.

You may also like
చర్చిలో పెళ్లి చేశారు..బాలకృష్ణే వచ్చారండి!
శ్రీవారి ఫోటోలు తీసేసి జీసస్ ఫోటోలు..YSRపై చంద్రబాబు సంచలనం!
‘కేరళ’ పేరు మార్పుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
అక్రమ వలసదారులు-రోహింగ్యాలు..ఏపీకి డేంజర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions