Tollywood news latest | హాలీవుడ్ సినిమా సీన్లను పోలె విధంగా భారతీయ మూవీల్లో కొన్ని సన్నివేశాలు కనిపిస్తుంటాయి. హాలీవుడ్ నుంచి కాపీ కొట్టి ఈ సీన్లను తీశారని నెటిజన్లు పోస్టులు పెట్టడం సాధారణంగా చూస్తుంటాం.
కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ‘పుష్ప’ సినిమాలోని పాటను ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ కాపీ కొట్టడం వైరల్ గా మారింది. ‘పుష్ప- ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అనే పాట ఎంత క్రేజ్ ను సొంతం చేసుకుందో తెలిసిందే.
ఈ పాట యావత్ దేశాన్ని ఊపేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూపొందించారు. ఇందులో సమంత అల్లు అర్జున్ సరసన స్టెప్పులేయడం అప్పట్లో హైలెట్ గా నిలిచింది. తాజగా ఈ పాటను హాలీవుడ్ లో కాపీ కొట్టారని దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు.
అతియే అనే పాప్ సింగర్ టర్కిష్ మరియు ఇంగ్లీష్ భాషల్లో పాటలను రూపొందిస్తారు. గతేడాది ఆమె విడుదల చేసిన ‘అన్లయాన’ అనే సాంగ్ అచ్చం ఊ అంటావా మామ అనే పాటను పోలే విధంగా ఉంటుంది. ఈ పాటపై తాజగా డీఎస్పీ స్పందించారు.
“ఊ అంటావా.. ఊహు అంటావా”ని ఇప్పుడు హాలీవుడ్ లో ఎవరో కాపీ కొట్టారని ఆయన తెలిపారు. దాని మీద కేస్ వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు ఫన్నీగా చెప్పారు. ఐదు నిమిషాల్లో రూపొందించిన పాటను హాలీవుడ్ కాపీ కొట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మన రేంజ్ అని వాళ్ళు నిరూపించారని డీఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు.









