Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్

Tobacco Packet In Tirumala Laddu | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదం జరుగుతున్న సమయంలోనే లడ్డూ విషయంలో ఓ మహిళా భక్తురాలికి షాకింగ్ ఘటన ఎదురైంది.

ఖమ్మం రూరల్ ( Khammam Rural )మండలం గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్లో ( Township )నివాసం ఉంటున్న దొంతు పద్మావతి సెప్టెంబర్ 19న తిరుపతికి వెళ్లారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని, కౌంటర్ ( Counter ) లో లడ్డూలను కొనుగోలుజేశారు. అనంతరం ఇంటికి తిరగొచ్చారు.

పవిత్రమైన శ్రీవారి లడ్డూలను తోటి బంధువులకు ఇచ్చేందుకు లడ్డూలను తెరిచారు. అయితే ఓ లడ్డూలో మాత్రం గుట్కా ప్యాకెట్ ( Tobacco Packet )ఉండడం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. ఈ మేరకు ఫోటో తీసి సోషల్ మీడియా ( Social Media )లో పెట్టడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions