Threat Call To Deputy Cm Accused Arrested | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) పేషీకి సోమవారం బెదిరింపులు రావడం కలకలం రేపిన విషయం తెల్సిందే.
పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసిన ఆగంతకుడు ‘చంపేస్తాం’ అంటూ బెదిరించడమే కాకుండా పలు మెసేజీలను సైతం పంపాడు. ఈ విషయాన్ని పేషీ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జున రావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు గుర్తించి, రహస్య ప్రదేశంలో అతన్ని విచారిస్తున్నారు.
బెదిరింపు కాల్స్ వచ్చిన నంబరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావుదిగా గుర్తించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న టవర్ నుండి ఫోన్ కాల్ వచ్చినట్లు తేలింది.