Discount For Pending Challans | రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల (Traffic Challans) క్లియరెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వాహనాలకు కు 60 శాతం పెండింగ్ చలాన్లకు రాయితీ ప్రకటించింది.
ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు కొనసాగుతుంది. అయితే ఈ రాయితీకి ఓ షరతు కూడా విధించింది. నవంబర్30 లోపు వరకు వాహనాలకు పడిన చలాన్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
ఓ నెటిజన్ తన పెండింగ్ చలాన్ కు డిస్కౌంట్ రాలేదంటూ స్ర్కీ న్ షాట్ తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లకు ట్వి ట్టర్ లో ప్రశ్నించారు. దీంతో పోలీసులు స్పందిస్తూ నవంబర్ 30 వరకు పడిన చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు.