Sunday 18th May 2025
12:07:03 PM
Home > తాజా > జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

TGSPDCL FIELD WORKERS

TGSPDCL Field Workers | తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జాతీయ రహదారులపై కూడా వరద రావడంతో రెండు రాష్ట్రాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రధాన పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వరద బాధితులకు వీలైనంత వరకు త్వరితగతిన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా TGSPDCL తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జోరు వర్షంలోనూ ఇద్దరు కార్మికులు స్తంభాలు ఎక్కి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్న వీడియోను TGSPDCL షేర్ చేసింది.

క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు మా ఫీల్డ్ వర్కర్ల అంకితభావానికి వందనం అంటూ సంస్థ పోస్ట్ చేసింది. వర్షంలో మీ నిబద్ధతకు హాట్సాఫ్ అంటూ ట్వీట్ చేసింది.   

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions