TG Police Warning | ఇటీవల కాలంలో సైబర్ నేరాలు (Cyber Crimes) మితీమీరుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బు ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
ముఖ్యంగా పార్ట్ టైమ్ (Part Time), వర్క్ ఫ్రం హోమ్ (Work From Home) పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. తాజాగా సికింద్రబాద్ కు చెందిన ఓ మహిళ నుంచి వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో బురిడీ కొట్టించి, రూ 14.5 లక్షలు దోచేశారు.
ఈ నేపథ్యంలో నెటిజన్లకు తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక సూచనలు చేశారు. “పార్ట్ టైమ్ ఉద్యోగం/వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేర్లతో మోసపూరిత లింకులు పంపించి మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. లేదా ఉద్యోగం రావాలంటే కొంత అమౌంట్ ముందస్తుగా కట్టాలని మాయమాటలు చెప్తారు. అలాంటి దగాపూరిత వలలో చిక్కి మీ కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల పాలు చేయకండి.” అని హెచ్చరించారు పోలీస్.