Telangana High Court | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆరెస్, బీజేపీ నాయకులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అనర్హత విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని న్యాయస్థానం ఆదేశించింది.