TG announces Flood Assistance | Telangana రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) . ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ (Command Control) సెంటర్ తో అనుసంధానం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలని చెప్పారు.
వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని, తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ రాయాలని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.
ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల సాయాన్ని సీఎం ప్రకటించారు.