Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘చట్టం చేసి ఇంటికో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాం’

‘చట్టం చేసి ఇంటికో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాం’

Tejashwi Yadav promises a govt job for each family | ఒక కొత్త చట్టాన్ని రూపొందించి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబానికి కచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం లభించేలా చేస్తామని కీలక హామీ ఇచ్చారు ఆర్జేడీ నేత, బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.

ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక న్యాయం కింద ఈ చారిత్రాత్మక హామీని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబాలకు కొత్త చట్టం రూపొందించి, తప్పనిసరిగా ఉద్యోగం అందించబడుతుందని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాలు-ఉపాధి అందించలేకపోయిందని మండిపడ్డారు.

ఆర్జేడీ నేతృత్వంలోని ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 20 రోజుల్లో ఒక ప్రత్యేక ”ఉద్యోగ-ఉపాధి చట్టం” రూపొందించి, 20 నెలల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అందించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గతంలో తాను ఉప ముఖ్యమంత్రి ఉన్న 17 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మరియు వామపక్షాలు కలిసి ఇండీ కూటమిగా అధికారంలోని జేడీయూ, బీజేపీ, ఎల్జేపీల ఎన్డీయే కూటమితో తలపడుతున్న విషయం తెల్సిందే.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions