TDP Suspends Local Leaders Over Fake Liquor Case | కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను అధినాయకత్వం సస్పెండ్ చేసింది. అన్నమయ్య జిల్లా ములకలచేరువులో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అందులో కల్తీ మద్యం తయారు చేస్తూ సప్లై చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్వాహకులుగా పేర్కొంటూ టీడీపీ నాయకులు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు ప్రకటించారు. కల్తీ మద్యం కేసులో ఇద్దరిపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.









